పొన్నాల రాజీనామాకు డిమాండ్
వరంగల్: దేవాదుల ప్రాజెక్టు పైప్ లైన్ లీక్ కు నైతిక బాధ్యత వహించి భారీ నీటి పారుదల శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య రాజీనామా చేయాలని తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యుడు ఎర్రబెల్లి దయాకర రావు డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డిపై, పొన్నాల లక్ష్మయ్యపై చీటింగ్ కేసు నమోదు చేయాలని ఆయన సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో డిమాండ్ చేశారు. దేవాదుల ప్రాజెక్టు పైప్ లైన్ ఆదివారంనాడు లీకయింది.
శ్రీరాంసాగర్ వరద కాలువ, దేవాదుల ప్రాజెక్టుల్లో మోసం చేశారని ఆయన విమర్శించారు. దేవాదుల ప్రాజెక్టు పైప్ లైన్లు ఇప్పటికి 17 సార్లు లీకయ్యాయని ఆయన చెప్పారు. పొన్నాల లక్ష్మయ్యను అబద్ధాలకోరుగా, రాజశేఖర రెడ్డిని అవినీతి ముఖ్యమంత్రిగా ఆయన అభివర్ణించారు. అఖిల పక్ష సమావేశం నిర్వహిస్తే దేవాదుల అక్రమాలను బయట పెడతామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications
