పెట్రో ధరలపై బిజెపి సైకిల్ ర్యాలీ
హైదరాబాద్: పెట్రో ఉత్పత్తుల పెంపునకు నిరసనగా భారతీయ జనతా పార్టీ (బిజెపి) ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో మంగళవారంనాడు సైకిల్ ర్యాలీ జరిగింది. ఈ సైకిల్ ర్యాలీలో బిజెపి నాయకులందరూ పాల్గొన్నారు. ఆర్థిక మాంద్యాన్ని అరికట్టలేక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేతులెత్తాశాయని బిజెపి అధ్యక్షుడు బండారు దత్తాత్రేయ విమర్శించారు. పెంచిన పెట్రో ఉత్పత్తుల ధరలను తగ్గించకపోతే తాము దశలవారీగా ఆందోళనలు చేపడుతామని ఆయన చెప్పారు. పెట్రో ఉత్పత్తుల ధరల పెంపునకు నిరసనగా బెజెపి యువమోర్చా సోమవారం సచివాలయ ముట్టడికి ప్రయత్నించింది.












Click it and Unblock the Notifications
