గుంటూరులో మిర్చి రైతుల రాస్తారోకో
గుంటూరు: గుంటూరు మిర్చియార్డు అగ్ని ప్రమాదంలో నష్టపోయిన రైతులు తమ ఆందోళనను తీవ్రతరం చేశారు. రెండు రోజులుగా వారు నిరాహార దీక్ష చేస్తున్నారు. అధికారులు తమను పట్టించుకోవడం లేదని విమర్శిస్తూ వారు మంగళవారం రాస్తారోకో నిర్వహించారు. హిందూ కాలేజీ సెంటరులో వారు రెండు గంటల పాటు బైఠాయించారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది.
అగ్ని ప్రమాదంలో 2 లక్షల 92 వేల టిక్కీలు దగ్ధమైతే 92 వేల టిక్కీలకే అధికారులు నష్టపరిహారం చెల్లిస్తామని అంటున్నారని, ఇది దారుణమని రైతులు అంటున్నారు. తమకు న్యాయం చేయకపోతే జిల్లా బంద్ నిర్వహిస్తామని వారు హెచ్చరించారు.












Click it and Unblock the Notifications
