పోలీస్ స్టేషన్ వద్ద కోడెల బైఠాయింపు
గుంటూరు: గుంటూరు జిల్లా నర్సారావుపేట పోలీసు స్టేషన్ ఎదుట తెలుగుదేశం పార్టీ నాయకుడు కోడెల శివప్రసాదరావు బుధవారం తన అనుచరులతో బైఠాయించారు. తనపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారని ఆరోపిస్తూ ఆయన ఈ నిరసన కార్యక్రమానికి పూనుకున్నారు. తనపై తప్పుడు కేసులు బనాయించినందుకు పోలీసులు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
తనను అడ్డు తొలగించుకోవడానికి మంత్రి కాసు వెంకట కృష్ణారెడ్డి కుమారుడు మహేష్ రెడ్డి మద్దెలచెర్వు సూర్యనారయణ రెడ్డితో చర్చలు జరుపుతున్నారని ఆయన ఆరోపించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ప్రజలను మోసం చేశారని కోడెల శివప్రసాదరావుపై పోలీసులు చీటింగ్ కేసు పెట్టారు. ఆ రియల్ ఎస్టేట్ సంస్థతో తనకు సంబంధాలు లేవని, ఇందుకు సంబంధించి తన వద్ద కోర్టు తీర్పులు కూడా ఉన్నాయని కోడెల చెప్పారు.












Click it and Unblock the Notifications