విశాఖపట్నం: బెల్టు షాపులను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ తెలుగు మహిళ అధ్యక్షురాలు రోజా బుధవారంనాడు విశాఖపట్నం ఆబ్కారీ సూపరింటిండెంట్ కార్యాలయం ముందు ధర్నా చేశారు. ఆమెతో పాటు పెద్ద యెత్తున మహిళలు ఈ ధర్నాలో పాల్గొన్నారు. వారు రోడ్డుపై బైఠాయించారు. ఇందిరమ్మ రాజ్యం ఇంటింటా సౌభాగ్యం కాదని, ఇంటింటా దౌర్బాగ్యమని రోజా అన్నారు.
మద్యం వల్ల గృహ హింస పెరుగుతోందని, నేరాలు, అత్యాచారాలు పెరుగుతున్నాయని ఆమె అన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే బెల్టు షాపులను రద్దు చేస్తుందని, కొత్తగా మద్యం షాపులకు లైసెన్సులు ఇవ్వబోదని ఆమె అన్నారు.