తిరుమల: తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి సేవా టికెట్లను అక్రమంగా అమ్ముతున్న అంతర్రాష్ట్ర ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. గదులు, ఆర్జిత సేవా టికెట్లు అమ్ముతున్న ఇద్దర్ని పోలీసులు బుధారంనాడు అదుపులోకి తీసుకున్నారు. టికెట్లను ఆన్ లైన్ లో బుక్ చేస్తూ వాటిని ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులకు వీరు అమ్ముతూ వస్తున్నారు.
ముఠాకు సహకరించిన సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) వర్గాలు చెప్పాయి. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తుల నుంచి ఈ ముఠా డిడిల రూపంలో డబ్బులు వసూలు చేస్తూ వస్తున్నారు.