కోడెలపై మంత్రి కాసు కౌంటర్
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ నాయకుడు కోడెల శివప్రసాదరావుపై పోలీసులు కేసు పెట్టడంలో తనకేమీ సంబంధం లేదని మంత్రి కాసు వెంకటకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. ప్రజల్లో కోల్పోయిన సానుభూతిని పొందడానికి శివప్రసాదరావు ఆందోళనకు దిగారని ఆయన గురువారం మీడియా ప్రతినిధులతో అన్నారు. కోడెల శివప్రసాదరావుపై పెట్టిన కేసేమిటో కూడా తనకు తెలియదని ఆయన అన్నారు. తమ కుటుంబం అటువంటిది కాదని ఆయన అన్నారు.
కోడెల శివప్రసాదరావును అడ్డు తొలగించుకోవాడానికి తన కుమారుడు మహేష్ రెడ్డి మద్దెలచెర్వు సూరిని సంప్రదించినట్లు వచ్చిన వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని ఆయన అన్నారు. కోడెల శివప్రసాదరావుకు పార్టీలోనే గుర్తింపు లేకుండా పోయిందని, ఈ స్థితిలో కోడెల ఆ విధమైన చర్యలకు దిగుతున్నారని ఆయన అన్నారు. మహేష్ ప్రజలకు దగ్గర కావాలని చూస్తున్నారని, తమ కుమారుడు మహేష్ రాజకీయాల్లోకి వస్తానంటే ఎందుకు కాదంటానని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
