మూడో రోజు కోడెల ధర్నా
గుంటూరు: తనపై తప్పుడు కేసు బనాయించారని ఆరోపిస్తూ తెలుగుదేశం పార్టీ నాయకుడు కోడెల శివప్రసాదరావు ధర్నా శుక్రవారంనాడు మూడో రోజుకు చేరుకుంది. తనపై తప్పుడు కేసు బనాయించారని ఆరోపిస్తూ ఆయన నర్సారావుపేట పోలీసు స్టేషన్ ముందు ధర్నా చేస్తున్నారు. పోలీసులు క్షమాపణ చెప్పే వరకు ధర్నాను విరమించేది లేదని కోడెల శివప్రసాదరావు చెప్పారు.
కోడెల ధర్నాకు మద్దతుగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు శుక్రవారం నర్సారావుపేటను దిగ్బంధం చేశారు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో మోసం చేశారని కోడెల శివప్రసాదరావుపై చీటింగ్ కేసు నమోదైంది. మంత్రి కాసు వెంకట కృష్ణారెడ్డి ప్రోద్బలం వల్లనే తనపై పోలీసులు తప్పుడు కేసు బనాయించారని ఆయన విమర్శిస్తున్నారు.












Click it and Unblock the Notifications
