కాందహార్ జైలు నుంచి 1000 మంది ఖైదీల పరారీ
కాందహార్: అఫ్ఘనిస్ధాన్ లోని కాందహార్ జైలు వద్ద ఈరోజు ఆత్మాహుతి దళాల బాంబు దాడిలో 15 మంది పోలీసులు మరణించారు. ఈ సంఘటన తర్వాత జైలులోని వేయి మంది ఖైదీలు పరారయ్యారు. పారిపోయిన ఖైదీలలో 400 మంది తాలిబన్ తీవ్ర వాదులు. దాదాపు 30 మంది తీవ్రవాదులు మోటారు సైకిళ్ళపై, కారు బాంబులతో మెరుపుదాడి చేశారు. ప్రధాన ద్వారానికి కాపలా ఉన్న పోలీసులను కారు బాంబు పేలుడుతో అటకాయించి రాకెట్లతో దాడులు చేశారు. అదే అదనుగా ఖైదీలను విడిపించుకుపోయారు.












Click it and Unblock the Notifications