ఉడుపి: కర్ణాటక రాష్ట్రం ఉడుపి నియోజకవర్గం బిజెపి ఎమ్మెల్యే రఘుపతి భట్ భార్య పద్మప్రియ నాలుగు రోజులుగా కన్పించడం లేదు. ఆమె ఉడుపి లోని తన ఇంటి నుంచి ఈనెల పదిన కారు స్వయంగా నడుపుకుంటూ కన్నవారింటికి బయలుదేరినట్టు తెలుస్తోంది. ఆమె అప్పటి నుంచి పుట్టినింటికి చేరలేదు, భర్త ఇంటికి తిరిగి రాలేదు. అధికార పార్టీ ఎమ్మెల్యే భార్య అదృశ్యం కావడంతో పోలీసు అధికారులు ఆఘమేఘాల మీద విచారణ చేపట్టారు. ఆమె ప్రయాణిస్తున్న కారును కుంజర్ గిరి వద్ద పోలీసులు కనుగొన్నారు. కారులో ఆమె హ్యాండ్ బ్యాగ్, సెల్ ఫోన్ లభించాయి. దుండగులతో ఆమె పెనుగులాడినట్టు పోలీసులకు ఆధారాలు లభించాయి.