రైతుల మహాధర్నా: పోలీసు కాల్పులు
నిజామాబాద్: బకాయిలు చెల్లించలేదంటూ వ్యాపారి మహిపాల్ రెడ్డికి వ్యతిరేకంగా రైతులు సోమవారం నిజామాబాదు జిల్లా ఆర్మూరులో చేపట్టిన మహాధర్నా ఉద్రిక్తతకు దారి తీసింది. రైతులు మహిపాల్ రెడ్డి ఇంటిపైకి రాళ్లు రువ్వారు. మహిపాల్ రెడ్డి ఇంటి ముందున్న వాహనాలను రైతులు ధ్వంసం చేశారు. ఫర్నీచర్ ను కూడా ధ్వంసం చేసారు. ఈ సమయంలో పోలీసులు జోక్యం చేసుకున్నారు. దీంతో రైతులు పోలీసులపైకి కూడా రాళ్లు రువ్వారు. ఈ సంఘటనలో సబ్ ఇన్సెపెక్టర్ గాయపడ్డారు.
ముందు పోలీసులు లాఠీచార్జీ చేశారు. దీంతో రైతులు తిరగబడ్డారు. పోలీసు వాహనాలను ధ్వంసం చేసారు. రైతులను అదుపు చేయడానికి పోలీసులు గాలిలోకి కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ముగ్గురు రైతులు గాయపడ్డారు. మహిపాల్ రెడ్డి ఇచ్చిన చెక్కులు చెల్లకపోవడంతో రైతులు ఆందోళనకు దిగారు. గత మూడు నెలలుగా రైతులు ఆందోళన చేస్తున్నారు. రైతుల నిరాహార దీక్షకు మద్దతుగా సోమవారం మహాధర్నా చేపట్టారు. పరిస్థితి ఉద్రిక్తతంగా ఉంది.












Click it and Unblock the Notifications
