వ్యాపారిపై దాడి: రు.30 వేల దోపిడీ
హైదరాబాద్: హైదరాబాదులోని రాజేంద్రనగర్ లో సోమవారం అర్థరాత్రి సమయంలో ఇంటికి వెళ్తున్న వ్యాపారిపై ముగ్గురు దుండగులు దాడి చేసి దాదాపు వేల రూపాయలు ఎత్తుకెళ్లారు. రాజేంద్రనగర్ లోని సాయిబాబా నగర్ లో దుకాణం మూసేసి గోవిందరాజు గౌడ్ అనే వ్యాపారి ఇంటికి వెళ్తుండగా ముగ్గురు దుండగులు పల్షర్ పై వచ్చారు. ఒక యువకుడు వాహనాన్ని ఆన్ లోనే పెట్టుకుని నిలబడగా ఇద్దరు బైక్ దిగి వ్యాపారిపై దాడి చేశారు. వారిని అడ్డుకోబోయిన ఒక యువకుడిపై కూడా వారు దాడి చేశారు.
వ్యాపారి వద్ద ఉన్న 30 వేల రూపాయలను ఎత్తుకెళ్లారు. పారిపోయే హడావిడిలో వారు ఒక బ్యాగును పడేసుకున్నారు. ఈ బ్యాగులో రివాల్పర్, తపంచా, ఐడెంటిటీ కార్డు, సెల్ ఫోన్ ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. అయితే పోలీసులు మాత్రం వివరాలు వెల్లడించడానికి నిరాకరిస్తున్నారు.












Click it and Unblock the Notifications