ప్రసన్నాంజనేయ స్వామి ఆలయంలో చిరు ప్రత్యేక పూజలు...
State
-Staff
By Staff
హైదరాబాద్: ఫిలింనగర్‌లోని ప్రసన్నాంజనేయ స్వామి ఆలయంలో మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయన భార్య, కుమారుడు రామ్ చరణ్‌తేజ్‌తో కలిసి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. బ్రహ్మోత్సవాలలో భాగంగా చిరు తన కుటుంబ సభ్యులతో కలిపి ఈ పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆలయ నాలుగవ వార్షికోత్సవం సందర్భంగా ఆయనను ఆలయ కమిటీ ఆహ్వానించారని తెలిపారు. అలాగే హనుమంతుడు తన ఇష్టదైవమని అన్నారు. ప్రజలందరి క్షేమం కోరి తాను ఈ పూజ నిర్వహించినట్లు ఆయన అన్నారు. రాజకీయ ప్రవేశంపై వస్తున్న వార్తలపై అడిగిన ప్రశ్నకు చిరు... చిరు నవ్వుతో సమాధానమిచ్చారు. ఇక ఈ రోజు మధాహ్నం గీతా ఆర్ట్స్ భవన్‌లో చిరంజీవి కోరు కమిటీ సమావేశం జరిగనుంది. ఈ సమావేశంలో ప్రతి జిల్లా నుంచి ఎంపిక చేసిన పదిమంది పాల్గొంటారు. అలాగే మధ్యాహ్నం సుందరయ్య విజ్ఞాన భవనంలో ఉపాధ్యాయ సమావేశం జరుగుతుంది.