గోల్డ్ క్వెస్టు కేసులో వైద్యాధికారి పరారీ
వరంగల్: గోల్డ్ క్వెస్ట్ వ్యవహారంలో వరంగల్ జిల్లా వైద్యాధికారి విజయ్ పాల్ ఇంటిలో పోలీసులు మంగళవారం సోదాలు నిర్వహించారు. విజయ్ పాల్ పరారీలో ఉన్నాడు. గోల్డ్ క్వెస్ట్ వ్యవహారంలో 63 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వీరిలో వైద్యులు, ఇంజనీర్లు, వృత్తినిపుణులు ఉన్నారు. ఇద్దరు వైద్యులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు కూడా సమాచారం.
ఈ కేసులో అందర్నీ అరెస్టు చేస్తామని వరంగల్ జిల్లా ఎస్పీ సజ్జనార్ చెప్పారు. ఈ కేసులకు సంబంధించి సాక్ష్యాధాలు సేకరిస్తున్నట్లు ఆయన తెలిపారు. గోల్డ్ క్వెస్టుకు సంబంధించి గీసుకొండ పోలీసు స్టేషనులో కేసులు నమోదయ్యాయి.












Click it and Unblock the Notifications