హైదరాబాద్: సినీ దర్శకుడు తేజ దాడి కేసులో హీరో నితిన్ మంగళవారంనాడు హైదరాబాదులోని నాంపల్లి కోర్టుకు హాజరయ్యాడు. ఈ కేసు విచారణ 15 రోజులకు వాయిదా పడింది. ధైర్యం సినిమా కొరియోగ్రాఫర్ నవీన్ కుమార్ పై దర్శకుడు తేజ దాడి చేసినట్లు కేసు నమోదైంది. ఈ కేసులో నితిన్ ను సాక్షిగా చేర్చారు. తేజ దాడి చేసిన సంఘటనను తాను చూడలేదని, ఆ రోజు తాను లేనని నితిన్ చెప్పాడు. అనవసరంగా తన పేరును ఈ కేసులో చేర్చారని ఆయన అన్నారు. కోర్టుకు నితిన్ వాంగ్మూలం ఇచ్చారు.