బెజవాడలో భార్య గొంతు కోసిన భర్త
విజయవాడ: విజయవాడలోని క్రీస్తు రాజపురంలో ఒక వ్యక్తి భార్య గొంతు కోసి పరారయ్యాడు. దేవకుమార్ అనే వ్యక్తి తన భార్య రాణి గొంతు కోశాడు. ఆమె ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. దేవకుమార్, రాణిలకు పదేళ్ల క్రితం పెళ్లయింది. వారికి ఏడేళ్ల పాప కూడా ఉంది. రాణి నర్సుగా పని చేస్తోంది. ఆమెపై దేవకుమార్ కు ఎక్కడ లేని అనుమానం.
ఒక కేసులో దేవకుమార్ రెండు రోజుల క్రితం విడుదలై వచ్చాడు. భార్యాభర్తలకు మధ్య పెద్ద గొడవ జరిగింది. దీంతో దేవకుమార్ ముందు కత్తితో తనను కోసుకునే ప్రయత్నం చేశాడు. నిన్ను కూడా చంపుతానంటూ అతను భార్య గొంతు కోసి ఇంటికి తాళం వేసి పారిపోయాడు. విషయం తెలిసిన స్థానికులు పోలీసులకు తెలియజేశారు. పోలీసులు వచ్చి గ్రిల్స్ తొలగించి రాణిని ఆస్పత్రికి తరలించారు.












Click it and Unblock the Notifications