మనుషుల అక్రమ రవాణాలో అరెస్టు
హైదరాబాద్: మనుషుల అక్రమ రవాణా కేసులో భరద్వాజ్ పటేల్ అనే వ్యక్తిని హైదరాబాద్ నగర నేర పరిశోధక విభాగం (సిసిఎస్) పోలీసులు అహ్మదాబాదులో అరెస్టు చేశారు. అతన్ని అహ్మదాబాద్ నుంచి హైదరాబాదుకు తరలించారు. ఈ కేసులో ఇప్పటికే పోలీసులు తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శాసనసభ్యులు కాశిపేట లింగయ్య, బాపూరావులను, రషీద్ అనే నిందితుడిని పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
కాశిపేట లింగయ్య భార్య తార పేరుతో సంగీతా బెన్ పటేల్ అనే మహిళను విదేశాలకు పంపడానికి రషీద్ ద్వారా భరద్వాజ్ పటేల్ నకిలీ వీసాను సృష్టించి వ్యవహారం నడిపినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. భరద్వాజ్ పటేల్ కోసం పోలీసులు ఇంతవరకు ఎనిమిది సార్లు అహ్మదాబాద్ వెళ్లారు. అయితే ఏజెంట్లు అతన్ని తప్పిస్తూ వచ్చారు. ఎట్టకేలకు తొమ్మిదో సారి పోలీసులు అతన్ని పట్టుకోవడంలో విజయం సాధించారు. అతన్ని విచారిస్తే మనుషుల అక్రమ రవాణా కేసుకు సంబంధించిన కీలక అంశాలు వెల్లడి కావచ్చునని పోలీసులు భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications