కూలీల కొడుక్కు ఐఐటి ర్యాంక్

Narasimha
హైదరాబాద్: దినసరి కూలీల కుమారుడు ఐఐటి పరీక్షలో మంచి ర్యాంక్ సాధించాడు. ఖమ్మం జిల్లాకు చెందిన కూలీ దంపతుల కుమారుడు మాగంటి నర్సింహకు ఐఐటిలో 453వ ర్యాంక్ వచ్చింది. ఐఐటి చదువుకు అయ్యే ఖర్చును భరించడానికి కార్పోరేట్ సంస్థ ముందుకు వచ్చింది. నర్సింహ తల్లిదండ్రులు ఐఐటి ఖర్చును భరించే స్థితిలో లేకపోవడంతో ఆ సంస్థ అతని చదువు ఖర్చులు భరించడానికి సిద్ధపడింది.

ఐఐటి జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ లో ఇంత మంచి ర్యాంకు సాధించిన మాగంటి నర్సింహ పరిస్థితి గురించి టీవీలో చూశానని, అతని చదువు ఆగిపోకూడదని అప్పుడే అనిపించిందని కోకరెంట్ సంస్థ సిఇఒ కె. సుధీర్ బాబు అన్నారు. అతన్ని తాను పిలిచి తాము ఫీజు చెల్లిస్తే చదువుతావా అని అడిగామని, తాను సరేనన్నాడని, దాంతో తాము అతన్ని చదువు ఖర్చులు భరించడానికి సిద్ధపడ్డామని ఆయన వివరించారు. నర్సింహ ఏడో తరగతి వరకు తన సొంత గ్రామంలో చదివాడు. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ ఆశ్రమ పాఠశాలలో చదివాడు. ఒక రాజకీయ నాయకుడి సాయంతో విజయవాడ నారాయణ కాలేజీలో చదివి ఇంటర్ లో 93 శాతం మార్కులు సాధించాడు. తమకు అందిన సహాయం పట్ల నర్సింహ తండ్రి అప్పయ్య కృతజ్ఞతలు తెలియజేశారు. తన కృషికి తగిన ఫలితం లభించిందని నర్సింహ అంటున్నాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+