ఎర్రజొన్న రైతుల దీక్ష విరమణ
నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ ఎర్రజొన్న రైతుల సమస్యలపై ప్రభుత్వాధికారులు బుధవారం రెండో విడత జరిపిన చర్చలు ఫలించాయి. ఎర్రజొన్న రైతులు తమ నిరాహార దీక్షలను విరమించారు. జాయింట్ కలెక్టర్ నిమ్మరసం ఇచ్చి రైతుల చేత దీక్షలు విరమింపజేశారు. దీంతో గత కొద్ది రోజులుగా నలుగుతున్న ఎర్రజొన్న రైతుల సమస్యలు కొలిక్కి వచ్చాయి.
ఎర్రజొన్నకు క్వింటాలుకు 1540 రూపాయల ధర చెల్లించడానికి ప్రభుత్వం అంగీకరించింది. ఇందులో 1200 రూపాయలు ఎపి సీడ్స్ చెల్లిస్తుంది. మిగతా 340 రూపాయలను ప్రభుత్వం ఆగస్టులో చెల్లిస్తుంది. ఎర్రజొన్న విత్తనాల సమస్యను సమీక్షించేందుకు ఒక కమిటీని వేయడానికి కూడా ప్రభుత్వం అంగీకరించింది. రైతులకు బాకీ పడ్డ వ్యాపారి మహిపాల్ రెడ్డిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హామీ ఇచ్చింది.












Click it and Unblock the Notifications
