సదాశివపేటలో రైతుల రాస్తారోకో
సంగారెడ్డి: మెదక్ జిల్లాలోని పలు చోట్ల రైతులు ఎరువులు, విత్తనాల కోసం ఆందోళనకు దిగారు. సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, నారాయణఖేడ్, సదాశివపేటల్లో రైతులు బుధవారం రాస్తారోకోకు దిగారు. సదాశివపేటలో రైతులు తొమ్మిదో నెంబర్ జాతీయ రహదారిపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. దీంతో కర్ణాటక, ముంబయిల నుంచి వాహనాలు, హైదరాబాద్ నుంచి అటు వైపు వెళ్లే వాహనాలు నిలిచిపోయాయి. అన్ని వైపులా 15, 16 కిలోమీటర్ల మేర వాహనాలు ఆగిపోయాయి.
ఎరువులు, విత్తనాల కోసం రైతులు సదాశివపేటలో మూడు రోజులుగా మార్కెట్ యార్డుల వద్ద కాపు కాస్తున్నారు. అయినా ఫలితం లేకపోవడంతో రైతులు బుధవారం రాస్తారోకోకు దిగారు. వాహనదారులకు, రైతులకు మధ్య వాగ్వివాదం కూడా చెలరేగింది. కలెక్టర్, రాజకీయ నాయకులు వచ్చి తమకు హామీ ఇచ్చే వరకు కదలబోమని రైతులు మొండికేసి కూర్చున్నారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ సంఘటన నేపథ్యంలో పోలీసులు రైతుల పట్ల వ్యవహరించాల్సిన తీరుపై తేల్చుకోలేకపోతున్నారు.












Click it and Unblock the Notifications
