హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం కాంప్లెక్స్ ఎరువుల ధరలను తగ్గించింది. ఈ ధరలు 60 రూపాయల నుంచి 120 రూపాయల వరకు తగ్గాయి. తగ్గిన ధరలు ఈ రోజు నుంచే అమలులోకి వస్తాయని వ్యవసాయ శాఖ మంత్రి ఎన్. రఘువీరా రెడ్డి చెప్పారు. కొత్త ధరలకు వ్యాపారులు ఎరువులు అమ్మకపోతే కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన జిల్లా అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఆయన బుధవారం జిల్లా కలెక్టర్లకు, ఎస్పీలకు లేఖలు రాశారు.
ఎరువుల అక్రమ రవాణాకు పాల్పడినా, అధిక ధరలకు అమ్మినా పిడి యాక్ట్ ప్రయోగిస్తామని ఆయన హెచ్చరించారు. ఎరువుల ధరలపై రైతులకు కరపత్రాల ద్వారా ఎప్పటికప్పుడు తెలియజేయాలని ఆయన అధికారులకు సూచించారు.