ప్రజాభీష్టం మేరకు నిర్ణయం: బాబు

Chandrababu Naidu
విజయనగరం: మరో రెండు, మూడు సమావేశాలు నిర్వహిస్తే గాని ప్రత్యేక తెలంగాణపై స్పష్టత రాదని, మరో రెండు సమావేశాలు నిర్వహించి నిర్ణయం తీసుకుంటామని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు చెప్పారు. విజయనగరం జిల్లా దేవుపల్లిలో జరిగిన తెలంగాణ కోర్ కమిటీ సమావేశానంతరం ఆయన బుధవారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. తాము తెలంగాణకు వ్యతిరేకం కాదని, ప్రజాభీష్టం మేరుకు నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు. తెలంగాణపై సరైన సమయంలో తగిన నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు. వచ్చే నెల మొదటివారంలో మరోసారి సమావేశమవుతామని, ఈ సమావేశంలో సమాచారాన్ని పంచుకున్నామని ఆయన చెప్పారు.

సమావేశంలో విధివిధానాలపై కన్నా సమగ్ర చర్చకే ప్రాధాన్యం ఇచ్చామని ఆయన చెప్పారు. మూడు గంటల పాటు తెలంగాణపై, పార్టీ పరిణామాలపై చర్చించామని ఆయన చెప్పారు. పార్టీ అంతర్గత విషయాలపై కూడా చర్చించామని ఆయన చెప్పారు. తెలంగాణ అంశం రాష్ట్రానికి సంబంధించిందని, అన్ని వైపుల నుంచి అభిప్రాయాలను తీసుకుంటామని ఆయన చెప్పారు. మీడియా ఊహించి వార్తలు రాస్తోందని ఆయన చెప్పారు. తెలంగాణపై నిర్ణయం తీసుకోవడానికి కాలపరిమితేమీ లేదని ఆయన చెప్పారు. తెలంగాణపై ఊహాగానాలు వద్దని, అన్నీ తామే చెప్తామని ఆయన మీడియానుద్దేశించి అన్నారు. తెలంగాణ చాలా సున్నితమైన అంశమని, మీడియా కూడా బాధ్యతగా వ్యవహరించాల్సి ఉంటుందని ఆయన అన్నారు.

తెలంగాణ విషయంలో కాంగ్రెస్ ఊసరవెల్లి రాజకీయాలు చేస్తోందని ఆయన విమర్శించారు. తెలంగాణకు కాంగ్రెసే ద్రోహం చేసిందని ఆయన అన్నారు. తెలంగాణ అంశాన్ని కాంగ్రెస్, తెలంగాణ రాష్ట్ర సమితి రాజకీయంగా వాడుకున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. తాము నోటీసులు ఇచ్చిన తర్వాత పార్టీ నాయకులెవరూ బహిరంగ ప్రకటనలు చేయవద్దని ఆయన హెచ్చరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+