యుపిఎ - లెఫ్ట్ సమావేశం వాయిదా
న్యూఢిల్లీ: అమెరికాతో అణు ఒప్పందంపై బుధవారం జరగాల్సిన యుపిఎ, వామపక్షాల సమన్వయ కమిటీ కీలక సమావేశం చివరి నిమిషంలో వాయిదా పడింది. ఈ సమావేశం తిరిగి ఈ నెల 25వ తేదీన జరుగుతుంది. సిరియా ప్రతినిధి బృందంతో విదేశాంగ కార్యదర్శి బిజీగా ఉండడంతో సమావేశాన్ని వాయిదా వేసినట్లు ప్రభుత్వం తెలియజేసింది.
కాగా, అణు ఒప్పందంపై నిర్ణయం తీసుకోవడానికి మరో ఆరు నెలల గడువు ఉందని ఆమెరికా ప్రకటించింది. జనవరి 20వ తేదీ లోగా భారత ప్రభుత్వం ఆమోదిస్తే అమెరికా కాంగ్రెస్ ఆమోదం కోసం తాము అన్ని ప్రయత్నాలు చేస్తామని బుష్ పాలనా యంత్రాంగం హామీ ఇచ్చింది. జనవరి 20వ తేదీ వరకు అణు ఒప్పందం ఆమోదం కోసం ప్రయత్నాలు చేయగలమని చెప్పింది. అమెరికాతో అణు ఒప్పందం తప్పదని ప్రధాని మన్మోహన్ సింగ్, యుపిఎ చైర్ పర్సన్ సోనియా గాంధీ అంటుండగా, ప్రభుత్వానికి బయటి నుంచి మద్దతు ఇస్తున్న వామపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి.












Click it and Unblock the Notifications
