హైదరాబాద్: ప్రజల మనోభావాలను గౌరవిస్తామని, ఏ ప్రాంతం వారిని కించపరచడం తమ ఉద్దేశం కాదని చిరంజీవి సోదరుడు, ప్రముఖ నటుడు నాగబాబు అన్నారు. ఇటీవల ఆయన ఒంగోలులో సమైక్యాంధ్ర తమ వ్యక్తిగత అభిప్రాయమని ప్రకటించడం, దానిపై టీఅర్ ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్రంగా మండిపడడం తెలిసిందే. చిరంజీవి సేవా సమితి ఆధ్వర్యంలో మల్కాజిగిరిలో జరిగిన ఒక కార్యక్రమంలో నాగబాబు ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. గతంలో తాను వెలిబుచ్చిన అభిప్రాయాలు తన వ్యక్తిగతమైనవని నాగబాబు వివరణ ఇచ్చారు.