ఆంధ్రజ్యోతి ఎడిటర్ శ్రీనివాస్ విడుదల

సోదర జర్నలిస్టులు, పత్రికా యాజమాన్యాలు, ప్రజా సంఘాల మద్దతు వల్లనే తాము విడుదల కాగలిగామని కె. శ్రీనివాస్ అన్నారు. తమ అరెస్టు ప్రజాస్వామ్యానికి ప్రమాదమని ఆయన అన్నారు. దళితులు, బలహీనవర్గాల మద్దతు తాము చేసినదాంట్లో తప్పు లేదనే ధైర్యాన్నిచ్చిందని ఆయన అన్నారు. ప్రభుత్వం భంగపడిందని ఆయన అన్నారు. దొంగ దెబ్బ తీయాలనే ప్రయత్నం బయటపడిందని ఆయన అన్నారు. కుట్ర పన్నినవారి గురించి సామాన్యులకు కూడా తెలిసిందని ఆయన అన్నారు. ఈ ఐక్యత ద్వారానే పౌర స్వేచ్ఛను, పత్రికా స్వేచ్ఛను కాపాడుకోగలమని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
