తెలంగాణపై ఒకె అంటేనే..: నాయని
హైదరాబాద్: తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుని తీర్మానం చేస్తే తాము తెలుగుదేశం పార్టీతో పొత్తుకు సిద్దమేనని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నాయకుడు నాయని నర్సింహారెడ్డి అన్నారు. తమ పార్టీ, తెరాస కలిస్తే తెలంగాణలో వంద సీట్లు వస్తాయని తెలుగుదేశం పార్టీ నాయకుడు ఎర్రబెల్లి దయాకరరావు ఎందుకన్నారో తనకు తెలియదని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటే ఎవరితోనైనా కలవడానికి తాము సిద్ధంగా ఉన్నామని ఆయన అన్నారు.
తెలుగుదేశం పార్టీ తెలంగాణకు అనుకూలంగా నిర్ణయమే తీసుకోలేదని, తీసుకున్నప్పుడు పొత్తు పెట్టుకోవడానికి అవకాశం ఉంటుందని ఆయన అన్నారు. దేవేందర్ గౌడ్ వల్ల తమ పార్టీకి ఏ విధమైన నష్టం లేదని, తమ పార్టీ నుంచి ఎవరూ అటు వెళ్లరని, ఒకరిద్దరు వెళ్లినంత మాత్రాన నష్టమేమీ లేదని ఆయన అన్నారు. అయినా దేవేందర్ గౌడ్ కూడా మంచి కార్యక్రమమే తీసుకుంటున్నారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
