రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి
రాజమండ్రి: తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడి మండలం బూరుగుపూడిలోని జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు దుర్మరణం చెందారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందినవారు. ఖమ్మం జిల్లాకు చెందిన చంద్రశేఖర్ అనే బంగారం వ్యాపారిత తన కుటుంబ సభ్యులతో కారులో అన్నవరం వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించింది.
వీరు ప్రయాణిస్తున్న కారు బూరుగుపూడి సమీపంలోని జాతీయ రహదారిపై సుష్కర వంతెన కోసం తవ్విన గోతిలో పడిపోయింది. దీంతో వాహనంలో ఉన్నవారిలో ఐదుగురు అక్కడిక్కడే మరణించగా, మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు వదిలారు. మరో బాలిక అపస్మారక స్థితిలో ఉంది.












Click it and Unblock the Notifications
