రామోజీ లైఫ్ స్టోరీ రాయాలి: ఉండవల్లి

రామోజీరావుపై క్రిమినల్ ప్రొసీడింగ్స్ ఉంటాయని, అందుకు సిద్ధంగా ఉండాలని ఆయన అన్నారు. తాను ఏ జర్నలిస్టుపై, పత్రికలపై, సంపాదుకులపై తాను ఒంటికాలిపై లేవలేదని ఆయన అన్నారు. రామోజీరావు తమ సంస్థ దినదినాభివృద్ధి చెందుతోందని రాసుకున్నారని, ఆదాయం పన్ను శాఖకు సమర్పించిన లెక్కల్లో యేటా నష్టాలు వస్తున్నాయని రామోజీరావు తెలిపారని, నష్టాలు వచ్చిన అసెట్స్ ఎలా పెరుగుతాయో చెప్తే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఉపయోగపడుతుందని, రామోజీరావు లైఫ్ స్టోరీ రాస్తే బాగుంటుందని ఆయన అన్నారు. తాను రామోజీరావు మీద సీరియల్ తీయలేదని, తాను సీరియల్ మొదలు పెట్టిన మాట నిజమేనని, అయితే అది వెలుగు చూడలేదని ఆయన అన్నారు.
రామోజీరావుపై కేసుకు, ఆంధ్రజ్యోతి సంపాదకుడు కె. శ్రీనివాస్ పై నమోదైన కేసుకు సంబంధం లేదని, రెండు వేర్వేరు తరహా కేసులని ఆయన చెప్పారు. శ్రీనివాస్ పై నమోదైన కేసు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసని, ఇందులో అరెస్టు తప్పదని ఆయన అన్నారు. మందకృష్ణ మాదిగ ఫిర్యాదు చేయకుండా ఉంటే వేరని, పత్రికలు మందకృష్ణ మాదిగ దిష్టిబొమ్మను కొట్టినట్లు ఫొటోలు ప్రచురించకపోతే పరిస్థితి ఇలా ఉండేది కాదని ఆయన అన్నారు. ఆంధ్రజ్యోతి వాళ్లు పట్టువిడుపులతో వ్యవహరించి ఉంటే కూడా మందకృష్ణ మాదిగ ఫిర్యాదు చేసి ఉండేవారు కాదేమోనని, ఇందులో ప్రభుత్వానికి గానీ కాంగ్రెసుకు గానీ సంబంధం లేదని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications
