పోలీసు స్టేషనుపై మహిళల దాడి
కరీంనగర్: కరీంనగర్ జిల్లా మల్లాపూర్ మండలం మహిళలను పోలీసు స్టేషన్ పై శుక్రవారం దాడి చేశారు. రాళ్లు, కర్రలతో పోలీసు స్టేషనుపై దాడి చేసి ఫర్నీచరును, అద్దాలను ధ్వంసం చేశారు. కామాంధుడిని తమకు అప్పగించనందుకు నిరసనగా వారు ఈ దాడికి దిగారు. వారిని అదుపు చేయడం పోలీసులకు ఇబ్బందిగానే ఉంది.
అరికంటి రాజేశం అనే వ్యక్తి తన భార్యకు విడాకులిచ్చాడు. అయితే లక్ష్మి అనే మహిళపై లైంగిక అత్యాచారానికి ప్రయత్నించాడు. ఆమె ప్రతిఘటింటడంతో కళ్లలో ఇసుక పోసి, ఇతరత్రా వేధించాడు. దీంతో పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. ఆ కామాంధుడికి దేహశుద్ధి చేయడానికి మహిళలు పూనుకున్నారు. అందుకు పోలీసులు అడ్డు రావడంతో మహిళలు పోలీసు స్టేషనుపై దాడి చేశారు.












Click it and Unblock the Notifications
