మద్దతు రద్దు ఖాయం: కారత్
న్యూఢిల్లీ: అణు ఒప్పందంపై ముందుకు వెళ్తే ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకోవడం ఖాయమని సిపిఎం ప్రధాన కార్యదర్శి ప్రకాష్ కారత్ అన్నారు. మత్వతత్వ శక్తులను అధికారానికి దూరంగా ఉంచేందుకు యుపిఎ ఏర్పడిందని, అణు ఒప్పందంపై ప్రభుత్వం ముందుకు సాగితే ఆ లక్ష్యం దెబ్బ తింటుందని, మతతత్వ శక్తులకు అవకాశం ఇచ్చే చర్యలకు ప్రభుత్వం పూనుకోకుండా చూడాలని యుపిఎ మిత్రపక్షాలకు విజ్ఞప్తి చేస్తున్నామని ఆయన అన్నారు. ప్రభుత్వం ముందుకు సాగితే నిరుడు నవంబర్ 16వ తేదీన వామపక్షాలకు, యుపిఎకు మధ్య జరిగిన ఒప్పందాన్ని ఉల్లంఘించడమే అవుతుందని ఆయన అన్నారు.
అణు ఒప్పందంపై ప్రభుత్వం వెనక్కి తగ్గకపోతే ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకునే అధికారాన్ని సిపిఎం పోలీట్ బ్యూరో సమావేశం కారత్ కు కట్టబెట్టింది. యుపిఎ- వామపక్షాల సమన్వయ కమిటీ ఒక నిర్ణయం తీసుకునే వరకు ముందుకు వెళ్లకూడదని యుపిఎ తమను కోరిందని కారత్ చెప్పారు. పెరుగుతున్న ద్రవ్యోల్బణం పట్ల కూడా సిపిఎం పోలిట్ బ్యూరో ఆందోళన వ్యక్తం చేసింది. ప్రధాని మన్మోహన్ సింగ్ ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడంలో విఫలమయ్యారని కారత్ విమర్శించారు.












Click it and Unblock the Notifications
