జ్యోతి నాపై రాసింది: చంద్రబాబు
విశాఖపట్నం: సాక్షి దినపత్రికలో ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డిపై ఏ విధమైన విమర్శలు రాలేదని, ఆంధ్రజ్యోతిలో తనను తప్పు పడుతూ వార్తాకథనాలు వచ్చాయని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు అన్నారు. చంద్రబాబు నాయుడు మీకోసం యాత్ర ఆదివారంనాడు 70వ రోజుకు చేరుకుంది. ఆయన యాత్ర విశాఖపట్నం జిల్లాలో సాగుతోంది. కుమారుడు లోకేష్, కోడలు బ్రాహ్మణి చంద్రబాబును నర్సీపట్నంలో చంద్రబాబును కలిశారు.
విశాఖపట్నం నగరాన్ని తాము అధికారంలోకి వస్తే హైదరాబాదు కన్నా మిన్నగా అభివృద్ధి చేస్తామని ఆయన చెప్పారు. విశాఖపట్నం నగరాన్ని దేశంలోనే అభివృద్ది చెందిన నగరంగా తీర్చిదిద్దుతామని ఆయన చెప్పారు. తాము అధికారంలోకి వస్తే బాక్సైట్ తవ్వకాలను రద్దు చేస్తామని ఆయన చెప్పారు. ప్రభుత్వం విచ్చలవిడిగా భూములు అమ్ముతుండడాన్ని ఆయన తప్పు పట్టారు.












Click it and Unblock the Notifications
