మరో చరిత్ర సృష్టిస్తాం: నాగబాబు
విశాఖపట్నం/ శ్రీకాకళం: తమ సోదరుడు మెగాస్టార్ చిరంజీవి త్వరలోనే శ్రీకాకుళం జిల్లా ప్రజలను కలుసుకుంటారని సినీ నటుడు నాగబాబు అన్నారు. విశాఖపట్నంలో ఆయన ఆదివారంనాడు రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. శ్రీకాకుళం జిల్లాలో కూడా ఆయన కొన్ని కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆయన కార్యక్రమానికి పెద్ద యెత్తున అభిమానులు వచ్చారు. వారిని అదుపు చేయడం కష్టమే అయింది. సేవా కార్యక్రమాలు పెద్ద యెత్తున చేయాలంటే రాజకీయాలే బాగా ఉపయోగపడతాయని ఆయన అన్నారు.
తమను విమర్శించేవారికి త్వరలోనే సమాధాం చెప్తామని ఆయన అన్నారు. వారికి ప్రేమ, సేవా కార్యక్రమాల ద్వారానే జవాబు చెప్తామని ఆయన అన్నారు. సేవా కార్యక్రమాల్లో చిరంజీవి అభిమానులకు సాటి వచ్చేవారు లేరని ఆయన అన్నారు. రాష్ట్రంలో మరో చరిత్ర సృష్టిస్తామని ఆయన చెప్పారు. సమాన గౌరవం, సమాన అవకాశాలు ప్రాతిపదికపై తాము పని చేస్తామని ఆయన చెప్పారు. బడుగు, బలహీనవర్గాలవారే తమకు అండ అని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
