పవన్ తో , బెల్లంకొండ సినిమా?
ప్రస్తుతం 'పులి' బిజీలో ఉన్న పవన్ కళ్యాణ్ మరో సినిమాకు సైన్ చేసాడని వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో బాలకృష్ణతో ఎన్నో హిట్ సినిమాలు రూపొందించిన బెల్లంకొండ సురేష్ ఈ ప్రాజెక్టుకు నిర్మాతగా వ్యవరిస్తారని అంటున్నారు. 'శివాజీ' తర్వాత బెల్లంకొండ మరో సినిమాని చేపట్టలేదు. మరో ప్రక్క పవన్ ...ఎస్‌పిఆర్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బానర్‌పై నూకారపు సూర్యప్రకాశరావు కి 'సత్యాగ్రహి' తీస్తానని మాట ఇచ్చారు. ఎఎం రత్నం వదులుకున్న ఆ ప్రాజెక్టును ఆయన చేపట్టారు. 2009 జనవరిలో 'సత్యాగ్రహి' సెట్స్ మీదకు వెళ్లనున్నది.
ఈలోగా బెల్లంకొండ సినిమా స్క్రిప్టు రెడీ చేస్తారంటున్నారు. పరిశ్రమ అంతర్గత వర్గాల సమాచారం ప్రకారం 'పులి' తర్వాత బెల్లంకొండతో పనిచేయడానికి పవన్ అంగీకరించాడనీ, అయితే అనుకోకుండా 'సత్యాగ్రహి' రంగం మీదికి వచ్చిందనీ తెలిసింది. ఇప్పటికే పవన్‌కు బెల్లంకొండ అడ్వాన్స్ కూడా ఇచ్చాడని వినిపిస్తోంది. అదే నిజమైతే 'సత్యాగ్రహి' తర్వాత పవన్, బెల్లంకొండ కాంబినేషన్ సినిమా వుండే అవకాశం ఉంది. ఇక పవన్‌కల్యాణ్ దర్శకత్వం వహించనున్న 'సత్యాగ్రహి' సినిమాకు స్క్రిప్ట్ సిద్ధమైంది. అలాగే పవన్ కళ్యాణ్ కామన్‌మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ మనకు 'సత్యాగ్రహి'లో దర్శనమివ్వనున్నది.












Click it and Unblock the Notifications
