ఎక్స్ పోజింగ్ తప్పదు: శ్రియ

ప్రస్తుతం శ్రియ అదే స్ధితికి వచ్చింది . మొదటి సినిమా 'ఇష్టం' నాటికీ ఇప్పటికీ ఆమె పోలిక లేకుండా పోయింది. ప్రక్కింటి అమ్మాయి అని ఆమె మీద ఉన్న ఇమేజ్ తొలిగించుకోవాలని ఆమె శతవిధాల ప్రయత్నం చేస్తోంది. అందులో భాగంగానే ఆ మధ్య 'మాగ్జిమం' కవర్ పేజీపై అదరకొట్టేలా ఫోజు ఇచ్చింది. అసలు ఈ తరహా ఎక్స్ పోజింగ్ పిచ్చి అంతా రజనీకాంత్ తో చేసిన 'శివాజీ' నుండి మొదలైంది. అలాగే ఈ మధ్య రకరకాల అవుట్ ఫిట్స్ వేసుకుని ఫొటో షూట్ కూడా జరిపించుకుందిట. అందులో ఐతే కళ్ళు తిప్పుకోని రీతలో అందాల ప్రదర్శన చేసిందిట.

దాంతో ఆమె సన్నిహితులు యేమిటిది శ్రియా అంటే హాలివుడ్ కి వెళ్ళాలంటే ఈ మాత్రం రెచ్చిపోవటం తప్పదని కూల్ గా సమాధానం ఇచ్చిందిట. అలాగే ఎవరైనా తమిళ, తెలుగు దర్శక, నిర్మాతలు వెళితే రకరకాల కండీషన్స్ పెడుతోందిట. రేటు కూడా కళ్ళు తిరిగేలా చెప్తోందిట. అంతేగాక విక్రమ్, రజనీకాంత్, కమల్ వంటి ప్రముఖులతోనే చేస్తాను అన్నట్లుగా బిహేవ్ చేస్తోందిట. యేదీ ఒకపట్టాన ఒప్పుకోవటం లేదట. కథ,అందులో తన పాత్ర స్పష్టత కావాలని అంటోందిట. అయినా హాలీవుడ్ కి రెడీ అవుతుంటే మన సినిమాలు యేం ఆనుతాయి అంటున్నారు అంతరార్ధం బోధ పడిన వాళ్ళు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+