మా వైఖరిలో మార్పు లేదు: ఏచూరి
న్యూఢిల్లీ: అణు ఒప్పందంపై తమ వైఖరిలో మార్పు లేదని సిపిఎం పోలిట్ బ్యూరో సభ్యుడు సీతారాం ఏచూరి చెప్పారు. ప్రధాని మన్మోహన్ సింగ్ చేసిన ప్రకటనపై ఆయన సోమవారం తీవ్రంగా ప్రతిస్పందించారు. అణు ఒప్పందంపై ప్రభుత్వం ముందుకు పోతే మద్దతు ఉపసంహరించుకుంటామని ఆయన చెప్పారు. ప్రధాని మాటల్లో కొత్త విషయమేమీ లేదని ఆయన అన్నారు.
అణు ఒప్పందం అమలుపై పార్లమెంటుకు అన్ని విషయాలు తెలియజేస్తామని ప్రధాని అంతకు ముందు మీడియా ప్రతినిధులతో అన్నారు. అణు ఒప్పందంపై అంతర్జాతీయ అణుశక్తి సంస్థతో చర్చల ప్రక్రియకు అనుతించాలని ఆయన వామపక్షాలను కోరారు. దాదాపు 15 రోజుల తర్వాత ప్రధాని అణు ఒప్పందంపై పెదవి విప్పారు.












Click it and Unblock the Notifications
