మరో 33 మంది కోసం గాలింపు
విశాఖపట్నం: మావోయిస్టుల దాడిలో సీలేరు నదిలో మునిగిపోయిన పోలీసుల కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఆదివారం సాయంత్రం సీలేరు నదిని పోలీసులు లాంచీలో దాటుతుండగా మావోయిస్టులు రాకెట్ లాంచర్లతో దాడి చేశారు. ఒరిస్సా సాయుధ బలగాలు, రాష్ట్ర గ్రేహౌండ్స్ బలగాలు గాలింపు చర్యలు ముగించి తిరిగి వస్తుండగా మావోయిస్టులు మాటు వేసి దాడి చేశారు. దీంతో లాంచీ మునిగిపోయింది.
ఇప్పటి వరకు లాంచిలో ప్రయాణించిన 29 మంది పోలీసులు బయటపడగా మరో 33 మంది ఆచూకీ తెలియడం లేదు. వారి కోసం హెలికాప్టర్ల ద్వారా, గజఈతగాళ్ల ద్వారా గాలిస్తున్నారు. సీలేరు నది ఉధృతంగా ప్రవహిస్తుండడం వల్ల, భారీ వర్షం వల్ల రాత్రి గాలింపు చర్యలు జరగలేదు. గల్లంతయినవారిలో ముంచంగిచుట్టు ఎస్సై కూడా ఉన్నాడు. లాంచీ డ్రైవర్ శంకరరావు మావోయిస్టుల అదుపులో ఉన్నట్లు తెలుస్తోంది. మావోయిస్టులు మళ్లీ దాడి చేయవచ్చుననే అనుమానంతో భారీ బలగాలను మోహరించారు.












Click it and Unblock the Notifications
