ఇక బిసిల్లో మరో 10 కులాలు
హైదరాబాద్: రాష్ట్రంలోని 10 కులాలను వెనకబడిన తరగతుల్లో (బిసిల్లో) చేర్చాలని రాష్ట్ర మంత్రి వర్గం నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి అధ్యక్షతన సోమవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఆ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు పావలా వడ్డీకే రుణాలు ఇవ్వాలని కూడా మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది.
రుణ మాఫీ కిందికి రాని రైతులకు ఐదు వేల రూపాయల ప్రోత్సహాకం ఇవ్వాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. నీటి సంఘాల్లో ఎమ్మెల్సీలకు స్థానం కల్పిస్తూ చట్టాన్ని సవరించాలని కూడా నిర్ణయం తీసుకుంది. చిన్న తరహా ఓడరేవుల అభివృద్ధికి రాక్ సంస్థతో ఒప్పందానికి మంత్రివర్గం ఆమోద ముద్ర లభించింది. ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల పోస్టు మెట్రిక్ ఉపకార వేతనాల ఆదాయ పరిమితిని లక్ష రూపాయలకు పెంచుతూ కూడా మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. విశాఖపట్నం జిల్లాలో పోలీసుపై మావోయిస్టులు జరిపిన దాడిపై మంత్రి వర్గ సమావేశంలో చర్చ జరిగింది.












Click it and Unblock the Notifications
