3న యుఎన్ పిఎ సమావేశం: బాబు

లోకసభకు ముందస్తు ఎన్నికలు రాకపోతే తన మీకోసం యాత్ర 150 రోజులు కొనసాగుతుందని చంద్రబాబు చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాల వల్ల సామాన్యుడి నడ్డి విరుగుతోందని ఆయన విమర్శించారు. ఇందిరమ్మ ఇళ్ల సమస్యపై ఆయన ప్రజలను ఆరా తీశారు. ఉత్తరాంధ్రలోని ఆరు శాసనసభా నియోజకవర్గాలకు ఆయన అభ్యర్థులను ఖరారు చేసినట్లు సమాచారం. ఎచ్చర్లకు కళా వెంకట్రావు, అముదాలవలసకు తమ్మినేని సీతారాం, రాజాంకు ప్రతిభా భారతి, నర్సన్నపేటకు లక్ష్మణరావు, పాలకొండకు నిమ్మక గోపాలరావు, పాతపట్నానికి మోహన్ రావు పేర్లను ఖరారు చేశారు. ఈ పేర్లను చంద్రబాబు అధికారికంగా ప్రకటిస్తారు. మరో నియోజకవర్గాన్ని చూసుకోవాల్సిందిగా సోంపేట శాసనభ్యుడు శివాజీకి చంద్రబాబు సూచించారు.












Click it and Unblock the Notifications
