హైదరాబాద్: విశాఖపట్నం జిల్లా బలిమెల రిజర్వాయర్ లో ప్రయాణిస్తున్న పోలీసులపై మావోయిస్టుల దాడి ఉహించని పరిణామమని ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి అన్నారు. అన్ని కోణాల్లో ఈ సంఘటనను పరిశీలిస్తున్నామని ఆయన సోమవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. సంఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపిస్తున్నామని ఆయన చెప్పారు. నక్సల్స్ ప్రభావిత రాష్ట్రాల మధ్య మరింత సమన్వయం అవసరమని ఆయన అన్నారు. సంఘటనా స్థలానికి ముఖ్యమంత్రి బయలుదేరి వెళ్లారు.