బోర్డు తిప్పేసిన అప్నాఘర్
హైదరాబాద్: మనీ సర్క్యులేషన్ కు చెందిన అప్నా ఘర్ అనే షేర్ మార్కెట్ కార్యాలయం బోర్డు తిప్పేసింది. డబ్బులు మదుపు చేసిన వారిని మోసం చేసి ఆ కార్యాలయం మూతపడింది. కంపెనీ యజమాని శ్రీనివాస రెడ్డి పరారీలో ఉన్నట్లు సమాచారం. డబ్బులు మదుపు చేస్తే షేర్ మార్కెట్లో పెట్టి 15 శాతం వడ్డీ ఇస్తానని అతను ఆశ చూపాడు. దీంతో పలువురు అందులో డబ్బులు పెట్టారు.
దాదాపు 50 కోట్ల రూపాయల మేరకు అతను మోసం చేసినట్లు సమాచారం. రెండు లక్షల రూపాయల నుంచి కోట్ల రూపాయల వరకు ఇందులో డిపాజిట్ చేసినవారున్నట్లు సమాచారం. వీరిలో కొందరు ప్రముఖులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ అప్నాఘర్ కార్యాలయం సికింద్రాబాదులో ఉంది. కార్యాలయం మూత పడడంతో మదుపుదారులు ఆందోళన చెందుతున్నారు.












Click it and Unblock the Notifications
