పతాకకు అవమానం: అద్వానీపై కేసు

LK Advani
భోపాల్: జాతీయ పతాకను అవమానించారంటూ బిజెపి ప్రధాని అభ్యర్థి ఎల్.కె. అద్వానీపై కేసు దాఖలైంది. మై కంట్రీ మై లైఫ్ అనే తన పుస్తకం హిందీ అనువాదం విడుదల సందర్భంగా జూన్ 30వ తేదీన అద్వానీ జాతీయ జెండాను అవమానించారని షాహిదుల్ రెహ్మాన్ తరఫున రాజ్ కుమార్ అనే న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు. జ్యుడిష్యల్ మెజిస్ట్రేట్ అజయ్ శ్రీవాస్తవ ముందు ఆయన ఈ పిటిషన్ దాఖలు చేశారు.

రాజ్యాంగం ప్రకారం జాతీయ పతాకను వ్యాపారీకరించడం సరికాదని రాజ్ కుమార్ అన్నారు. జాతీయ పతాకపై ఏ విధమైన అక్షరాలను ముద్రించకూడదని ఆయన అన్నారు. అతిథుల, తదితరుల వేదిక అలంకరణకు కూడా వాడకూడదని ఆయన అన్నారు. అద్వానీ పుస్తకం కవర్ త్రివర్ణాలను బ్యాక్ గ్రౌండుగా ఇచ్చారని, పుస్తకం కవర్ హోర్డింగ్స్ ను కూడా నగరంలో ప్రదర్శించారని ఆయన విమర్శించారు. ఇదంతా అద్వానీ సమక్షంలోనే జరిగిందని ఆయన చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+