లెఫ్ట్ నిర్ణయం శుభపరిణామం: కాకా
హైదరాబాద్: ఐక్య ప్రగతిశీల కూటమి (యుపిఎ)కి వామపక్షాలు మద్దతు ఉపసంహరించుకోవడం తెలంగాణకు శుభపరిణామమని కాంగ్రెస్ సీనియర్ పార్లమెంటు సభ్యుడు జి. వెంకటస్వామి అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాంగ్రెసుతోనే సాధ్యమని ఆయన అన్నారు. అణు ఒప్పందంపై యుపిఎకు మద్దతు తెలపాలని ఆయన తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)ని కోరారు. తెలంగాణ రాష్ట్రం ఇస్తానని ప్రకటన చేస్తేనే మద్దతిస్తామని తెరాస అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు అనడం సరి కాదని ఆయన అన్నారు. ముందు మద్దతు ఇవ్వడం వల్ల తెలంగాణపై పట్టు పట్టడానికి తెరాసకు నైతిక బలం చేకూరుతుందని ఆయన అన్నారు.
తెలంగాణ విషయంపై తాను కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సిడబ్ల్యుసి) సమావేశంలో ప్రస్తావిస్తానని ఆయన చెప్పారు. ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డికి ఆయన బుధవారంనాడు బహిరంగ లేఖ రాశారు. చేవెళ్ల - ప్రాణహిత ప్రాజెక్టు నిర్మాణంలో జాప్యం పట్ల ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. వాప్కో సంస్థ పనితీరుపై కూడా ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications
