రాజీనామాపై స్పీకర్ సోమనాథ్ మౌనం
న్యూఢిల్లీ: లోకసభ స్పీకర్ పదవికి రాజీనామా చేసే విషయంపై మాట్లాడడానికి సోమనాథ్ ఛటర్జీ నిరాకరించారు. యుపిఎ ప్రభుత్వానికి వామపక్షాలు మద్దతు ఉపసంహరించుకోవడంతో సోమనాధ్ ఛటర్జీ స్పీకర్ పదవికి రాజీనామా చేస్తారనే ప్రచారం మొదలైంది. తాజా రాజకీయ పరిణామాలపై బుధవారం విలేకరులు ప్రస్తావించినప్పుడు నాకు తెలుసు. మీరేం చెప్పాల్సిన అవసరం లేదు. స్పీకర్ కార్యాలయానికి మీరు న్యాయం చేయడం లేదు అని ఆయన అన్నారు.
తానింకా స్పీకరుగానే ఉన్నానని ఆయన చెప్పారు. స్పీకర్ పదవిలో కొనసాగాలా, వద్దా అనే విషయంపై నిర్ణయాన్ని సోమనాధ్ ఛటర్జీకే వదిలేశామని అంతకు ముందు సిపిఎం ప్రధాన కార్యదర్శి ప్రకాష్ కారత్ చెప్పారు. తాజా రాజకీయ పరిణామాలపై మాట్లాడడానికి ఆయన నిరాకరించారు.












Click it and Unblock the Notifications
