దేవేందర్ పై తలసాని మండిపాటు
హైదరబాద్: పార్టీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి టి. దేవేందర్ గౌడ్ పై తెలుగుదేశం శాసనసభ్యుడు తలసాని శ్రీనివాస యాదవ్ తీవ్రంగా ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఒక్కటవుతారని దేవేందర్ చేసిన ప్రకటనపై ఆయన బుధవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో మండిపడ్డారు.
దేవేందర్ గౌడ్ 20 ఏళ్ల పాటు పదవులు అనుభవించి కోట్లాది రూపాయలు ఆర్జించారని, ఆ సంపాదనలో సగం పెట్టినా తెలంగాణలో రెండు నీటి పారుదల ప్రాజెక్టులు పూర్తవుతాయని ఆయన అన్నారు. తల్లిలాంటి పార్టీలో పదవులు అనుభవించి దేవేందర్ గౌడ్ బిసి దొరగా ఎదిగారని ఆయన వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications
