మమ్మల్లి మోసం చేసింది: కారత్

Prakash Karat
న్యూఢిల్లీ: అణు ఒప్పందంపై ఐక్య ప్రగతిశీల కూటమి (యుపిఎ)పార్లమెంటును విశ్వాసంలోకి తీసుకోలేదని సిపిఎం ప్రధాన కార్యదర్శి ప్రకాష్ కారత్ విమర్శించారు. తమ మద్దతు ఉపసంహరణతో యుపిఎ ప్రభుత్వం మైనారిటీలో పడిపోయిందని, ప్రభుత్వం బలపరీక్షకు సిద్ధపడాలని ఆయన అన్నారు. రాష్ట్రపతికి మద్దతు ఉపసంహరణ లేఖను సమర్పించిన అనంతరం ఆయన బుధవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెసు తమను మోసం చేసిందని ఆయన వ్యాఖ్యానించారు. తాము మొదటి నుంచీ అణు ఒప్పందానికి వ్యతిరేకమేనని ఆయన చెప్పారు.

అణు ఒప్పందంపై ప్రభుత్వం పారదర్శకంగా లేదని ఆయన అన్నారు. ఒప్పందానికి సంబంధించిన అంశాలను ప్రజలకు వివరించాలని ఆనయ డిమాండ్ చేశారు. ప్రభుత్వం చూపంతా అమెరికా వైపే ఉందని, బుష్ కోరికలు తీర్చే రాజకీయ పక్షంగా తాము ఉండదలుచుకోలేదని ఆయన అన్నారు. అణు ఒప్పందం ముసాయిదాను ప్రభుత్వం దాచి పెట్టిందని ఆనయ విమర్శించారు. ప్రభుత్వ దృష్టంతా అణు ఒప్పందంపైనే ఉందని, ధరలను నియంత్రించాలనే ఆలోచన లేదని ఆయన విమర్శించారు. లోకసభ స్పీకర్ సోమనాధ్ ఛటర్జీ విషయంపై మాట్లాడబోమని, కొనసాగాలా రాజీనామా చేయాలా అనే విషయాన్ని ఛటర్జీ నిర్ణయించుకుంటారని ఆయన చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+