ఎమ్మెల్యేపై కాంగ్రెస్ కార్యకర్తల వీరంగం

హైదరాబాద్: రాష్ట్ర మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమక్షంలోనే సిపిఎం శాసనసభ్యుడు మక్కా నర్సింహకు శుక్రవారం పరాభవం ఎదురైంది. నర్సింహను కాంగ్రెసు కార్యకర్తలు చొక్కా పట్టుకుని వేదికపై నుంచి కిందికి లాగేశారు. దుర్భాషలాడారు. ఒక సమయంలో కొట్టడానికి కూడా చేతులెత్తారు. ఈ పరాభవానికి శాసనసభ్యుడు కన్నీటి పర్యంతమయ్యారు.

రంగారెడ్డి జిల్లాలోని ఒక బ్యాంకు రుణమాఫీ కార్యక్రమానికి సబితా ఇంద్రారెడ్డి హాజరయ్యారు. ప్రభుత్వ రుణమాఫీ పథకంపై ప్రశ్నించడానికి శాసనసభ్యుడు అక్కడికి చేరుకున్నారు. దీంతో రెచ్చిపోయిన కాంగ్రెసు కార్యకర్తలు ఆయన పట్ల దురుసుగా వ్యవహరించారు. ఇంత జరుగుతున్నా కార్యకర్తలను మంత్రి నిలువరించకపోవడం ఆశ్చర్యం కలిగించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+