దేవేందర్ ది నవ తెలంగాణ ప్రజా పార్టీ

Devender Goud
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి టి. దేవేందర్ గౌడ్ తెలంగాణ రాష్ట్ర లక్ష్య సాధన కోసం నవ తెలంగాణ ప్రజా పార్టీ (ఎన్టీపిపి)ని ఏర్పాటు చేశారు. పార్టీకి సంబంధించిన ప్రకటనను శుక్రవారం జరిగిన ఒక బహిరంగ సభలో చేశారు. జెండా పాలపిట్ట రంగులో ఉంటుంది. జెండా తెలంగాణ భౌగోళిక పటంలో పుస్తకం, పార, నాగలి, కాగడా గుర్తులుంటాయి. పుస్తకం సంపూర్ణ అక్షరాస్యతకు, నాగలి రైతుల సంక్షేమానికి, పార కార్మికుల శ్రమకు, కాగడా చైతన్యానికి గుర్తులు. మొత్తంగా ఈ గుర్తులన్నీ తెలంగాణ ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబిస్తాయని దేవేందర్ గౌడ్ చెప్పారు. ఈ నెల 27వ తేదీన హైదరాబాదులో పార్టీ బహిరంగ సభ భారీగా జరుగుతుందని ఆయన చెప్పారు. ఈ నెల 27వ తేదీన పార్టీ ప్రణాళికను, విధివిధానాలను ప్రకటించనున్నట్లు ఆయన తెలిపారు.

ఆత్మాభిమానం చంపుకోలేకనే పార్టీని స్థాపిస్తున్నట్లు దేవేందర్ చెప్పారు. పార్టీ పెట్టే విషయంలో తనకు పార్టీలకు అతీతంగా సూచనలు వచ్చాయని ఆయన చెప్పారు. తాను మేధావుల నుంచి సూచనలు తీసుకుంటూనే ఉంటానని ఆయన అన్నారు. తెలంగాణలో జీవనదులున్నా నీరు అందకుండా పోయిందని ఆయన అన్నారు. తెలంగాణ సాధనలో తనకు సహకరించాలని ఆయన కోరారు. ఆంధ్రా మిత్రులు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని, అన్నదమ్ముల్లాగా విడిపోయి రెండు ప్రాంతాలను అభివృద్ధి చేసుకుందామని ఆయన అన్నారు. రెండు ప్రాంతాల్లోనూ పేదలు ఇబ్బందులు పడుతున్నారని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+