నేను చిరు అభిమానినే, కానీ..: రాధా

Chiranjeevi
హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవికి ఉన్న లక్షలాది మంది అభిమానుల్లో తాను ఒక్కడినని విజయవాడ తూర్పు కాంగ్రెస్ శాసనసభ్యుడు వంగవీటి రాధాకృష్ణ అన్నారు. తాను కాంగ్రెస్ పార్టీని వీడి చిరంజీవి పార్టీలో చేరుతున్నట్లు వచ్చిన వార్తలపై ఆయన శుక్రవారం ముఖ్యమంత్రి డాక్టర్ రాజశేఖర రెడ్డిని కలిసి వివరణ ఇచ్చారు. తాను కాంగ్రెస్ పార్టీని వీడేది లేదని ఆయన మీడియా ప్రతినిధులతో అన్నారు.

అభిమానంతో రాజకీయాలను ముడి పెట్టకూడదని ఆయన అన్నారు. తాను ప్రస్తుతం కాంగ్రెసులో ఉన్నానని, కాంగ్రెసులోనే ఉంటానని, భవిష్యత్తులో ఎక్కడ ఉంటాననేది చెప్పలేనని ఆయన అన్నారు. చిరంజీవి కుటుంబంతో తనకు సాన్నిహిత్యం ఉన్న మాట కూడా వాస్తవమేనని ఆయన అన్నారు. వంగవీటి రాధాకృష్ణ చిరంజీవి పార్టీలో చేరుతారని చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. ఇందులో భాగంగానే ఆయన తన సహహర శాసనసభ్యుడు నెహ్రూతో వివాదానికి దిగినట్లు అభిప్రాయం వ్యక్తమైంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+