మాల నేతలపై మారెప్ప మండిపాటు
హైదరాబాద్: ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణను వ్యతిరేకిస్తున్న మాలలపై మంత్రి మారెప్ప విరుచుకు పడ్డారు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన శుక్రవారం మీడియా ప్రతినధుల సమావేశంలో చెప్పారు. మాలలు అభివృద్ధి చెందిన దళితులని, మాదిగలు కూడు వంటి కనీసావసరాలకు ఇబ్బందులు పడ్డుతున్నారని ఆయన అన్నారు. వర్గీకరణను వ్యతిరేకించిన గుజరాత్ ఎస్సీ సెల్ నాయకుడు యోగీంద్ర మక్వానాపై కూడా ఆయన విరుచుకుపడ్డారు. ఎస్సీ వర్గీకరణ జరుగుతుందని, ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి మాటపై నిలబడే వ్యక్తి అని ఆయన అన్నారు.
ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణను వ్యతిరేకిస్తున్న తమ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యుడు హర్షకుమార్ లాంటి వారు పేపర్ టైగర్స్ అని ఆయన అన్నారు. మాలల నాయకులు జూపూడి ప్రభాకరరావు, కారెం శివాజీ లాంటివాళ్లపై, వారికి మద్దతిస్తున్న సీనియర్ నాయకులపై కూడా ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పోలీసు శాఖపై తాను చేసిన విమర్శలకు కట్టుబడి ఉన్నానని ఆయన చెప్పారు. పోలీసు శాఖలోని దుర్గుణాలపై ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డికి నివేదిక ఇస్తానని ఆయన చెప్పారు. పోలీసు శాఖలో అణగారిన వర్గాలకు, బలహీన వర్గాలకు అన్యాయం జరుగుతోందని ఆయన అన్నారు. ఆలయాలు, మసీదులు, చర్చిల భూముల అన్యాక్రాంతం ఆపాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.












Click it and Unblock the Notifications
