రాజకీయ పార్టీ అవసరమే: పెద్దిరెడ్డి
న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర సాధనకు ఉద్యమాలతో పాటు రాజకీయ పార్టీ కూడా అవసరమేనని నవ తెలంగాణ ప్రజా పార్టీ నాయకుడు ఇ. పెద్దిరెడ్డి అన్నారు. పార్టీని ఎన్నికల కమీషన్ వద్ద నమోదు చేయడానికి ఆయన శుక్రవారం ఢిల్లీ వచ్చారు. తెలంగాణ సాధన కోసం అన్ని పార్టీలను కలుపుకొని ముందుకు సాగుతామని ఆయన చెప్పారు.
ఆగస్టు 27న హైదరాబాదులో పార్టీ బహిరంగ సభ తర్వాత ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఆయన చెప్పారు. పెద్దిరెడ్డి ఇటు ఢిల్లీలో ఉండగానే దేవేందర్ గౌడ్ నవ తెలంగాణ ప్రజా పార్టీని స్థాపిస్తూ హైదరాబాదులో ప్రకటన చేశారు.












Click it and Unblock the Notifications
